AP: 12 మున్సిపాలిటీల‌కు పోలింగ్ ప్రారంభం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలో నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌లకు ప్రారంభ‌మ‌యిన‌ది. ఈరోజు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌టిష్ఠ భ‌ద్ర‌త ఏర్పాటు చేయాల‌ని అన్ని జిల్లాల అధికారుల‌ను ఎస్ఈసి నీలం సాహ్ని ఆదేశించారు. కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో పోలింగ్ జ‌రుగుతోంది. బుధ‌వారం ఓట్లు లెక్కించి గెలుపొందిన వారిని ప్ర‌క‌టించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.