అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్. రూ. 2 కోట్ల గంజాయి సీజ్!
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాచకొండ ఎస్వోటీ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల నుండి 1240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మూడు కార్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.