గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
హైదరాబాద్ (CLiC2NEWS): గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని నామినేట్ చేశారు. ఈ మేరకు సంబంధిత ఫైల్‌పై శుక్రవారం గవర్నర్ సంతకంచేశారు. కాగా ఈ నిర్ణయంపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. సిరికొండ మధుసూదనాచారి.. 2014 నుంచి 2018 వరకు శాసనసభ స్పీకర్‌గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం విదితమే.