హైద‌రాబాద్‌లో వాటర్‌ ట్యాంకర్‌- బైక్‌ ఢీ. మహిళ మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కింగ్‌కోఠిలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కింగ్‌కోఠిలోని ఎడెన్‌ గార్డెన్‌ వద్ద ఓ మోటార్‌సైకిల్‌ను వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాడీని పోస్టు మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.