చౌరాసియాపై దాడి నిందితుడు బాబుపై 3 కేసులు: సిపి అంజనీ కుమార్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): సినీనటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది సినీ షూటింగ్‌ సెట్‌లలో హెల్పర్‌గా పనిచేస్తున్న కొమ్ము బాబుగా గుర్తించారు. బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో అద్దెకు ఉంటున్నాడని… మహబూబ్​నగర్ జిల్లా కుల్కచర్ల సొంత గ్రామానికి చెందిన కొమ్ము బాబుపై గతంలోనూ కేసులు ఉన్నాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన చరవాణీ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. నిందితుడు బాబును మీడియా ముందు హాజరుపరిచారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు.

నిందితుడిది మహబూబ్‌నగర్‌ జిల్లా కుల్కచర్ల అని, ప్రస్తుతం అతడు యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. బాబు గదిలో బౌరాసియా ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతనిపై గతంలో విజయవాడ, బంజారాహిల్స్‌, గోల్కొండ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయని సిపి చెప్పారు. గోల్కొండ పీస్‌లో నమోదైన కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లొచ్చాడని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.