న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

హైదరాబాద్(CLiC2NEWS)‌: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైనారు. దీంతో ఆయ‌న‌ను అపోలో ఆసుపత్రిలో చికిత్స‌నందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు కైకాల ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్య ప‌రిస్థి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. చికిత్స‌కు ఆశించినంత మేర ఆయ‌న స్పందించ‌టంలేదు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు.
విష‌యం తెలుసుకున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స‌త్య‌నారాయ‌ణ క్షేమంగా తిరిగి రావాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.