డిసెంబర్‌ 1 నుంచి హైకో‌ర్టులో ఏ–4 ప్రింట్లకు అను‌మతి

హైద‌రా‌బాద్ (CLiC2NEWS): డిసెంబర్‌ 1 నుంచి హైకో‌ర్టులో పిటి‌షన్లు, కౌంటర్‌ పిటి‌షన్లు సహా ఇతర అన్ని రకాల పిటి‌ష‌న్లను A-4 సైజ్‌ పేప‌రుపై ఇరు‌వై‌పులా ప్రింట్‌తీసి దాఖలు చేసేం‌దుకు హైకోర్టు అను‌మ‌తిం‌చింది. ఈమేరకు హైకోర్టు రిజిర్‌స్టార్‌ జన‌రల్‌ నాగా‌ర్జున ఉత్తర్వులు జారీ‌చే‌శారు.
ఇప్పటి‌వ‌రకు కోర్టులో లీగల్‌ సైజ్‌ పేప‌రులో ఒక‌వైపే ప్రింట్‌ తీసిన పిటి‌ష‌న్లను దాఖలు చేసేం‌దుకు అను‌మతి ఉంది. హైకోర్టు, కింది కోర్టుల్లోA-4 సైజ్‌లో రెండు‌వై‌పులా ప్రింట్‌ తీసిన వాటిని అను‌మ‌తిం‌చేలా ఆదే‌శిం‌చా‌లని కోరుతూ హైద‌రాబాద్‌కు చెందిన లాయ‌ర్ మయూర్‌ ముంద్రా ఇటీ‌వల ప్రజా‌హిత వ్యాజ్యం దాఖలు చేశారు.

సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని 10 హైకో‌ర్టులు ఇప్పటికే ఇలాంటి అను‌మతి మంజూరు చేశా‌యని పిటి‌ష‌నర్ పేర్కొన్నారు. ఇటీ‌వల జ‌రిగిన ఫుల్‌‌కోర్టు (హై‌కోర్టు న్యాయ‌మూ‌ర్తు‌లంతా) సమా‌వేశం దీనిపై సాను‌కూల నిర్ణయం తీసు‌కుంది.

Leave A Reply

Your email address will not be published.