షేక్.బహర్ అలీ: భుజంగాసనం..

చేయు విధానం:
ముందుగా బోర్ల పడుకోవాలి.తరువాత కడుపు బలంతో పడుకోవాలి. అర చేతులు భూమిపై ఉంచుతూ చేతులు ఛాతికి రెండు వైపులా ఉంచాలి. అర చేతులు పైకి లేపబడి మరియు భుజాలు ఛాతి నుండి దూరంగా ఉంచాలి.

  • కాళ్ళు నిటారుగా మరియు కాలి వేళ్ళు కలిపి ఉంచాలి. కాళ్ళు వీపువైపునకు ఉండి భూమికి అనించి ఉంచాలి.
  • శ్వాసను లోపలికి తీసుకుంటూ ఛాతి మరియు తలను మెల్లమెల్లగా పైకి లేపాలి. నాభి వెనుక భాగం భూమి పైనే ఉంచండి. తలను పైకి లేపుతూ మేడను ఎంత వరకు వెనుకకు వంచగలరో అంత వరకు వంచండి. ఈ స్థితిలో దాదాపు 30 సెకనులు ఉంచాలి. యధా స్థితికి తిరిగి రావాలి.

ఈ ఆస‌నం వ‌ల్ల‌ ప్రయోజనాలు..

1. ఈ ఆసనం పరివర్తన కలిగించి మతిమరుపు రోగం నుండి విముక్తి కలిగిస్తుంది.

2. నడుము నొప్పి, సయాటికా, స్లిప్ డిస్క్, సర్వైకల్ స్పాండిలోసిస్, వెన్నుముక వికారాలు తగ్గిస్తుంది.

3. థైరాయిడ్, పారా థైరాయిడ్, గ్రందులలో శక్తినిస్తుంది. అస్తమా రోగం కూడా తగ్గుతుంది.

4. కాలేయానికి శక్తినుస్తుంది. అజిర్తి, గ్యాస్, ఆమ్లపిత్తం, మధుమేహం, ఉదర సంబదించిన రోగాలు దూరం అవుతాయి. మేరు దండం బాగా సాగి ఆరోగ్యవంతంగా ఉంటుంది.

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.