ఓవర్ టేక్ చేశారని బస్సు అద్దాలు పగులగొట్టిన బైకర్
గంగాధర (కరీంనగర్):
బైక్‌ను ఓవర్ టేక్ చేశారనే కోపంతో ఆర్టీసీ బస్సు అద్దాలను ఓ యువకుడు పగుల గొట్టాడు. ఈ ఘటన జిల్లాలలోని గంగాధర సమీపంలో చోటుచేసుకుంది.
కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లున్న ఆర్టీసీ బస్సు గంగాదర సమీపంలో ఓ బైక్‌ను ఓవర్టేక్ చేసింది. దీంతో తీవ్ర కోపం వచ్చిన బైక్‌పై వెళ్లున్న యువకుడు వేగంగా వచ్చి బస్సుకు అడ్డంగా బైక్ నిలిపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. బస్సు ఓవర్టేక్ చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం బస్సులో ఉన్నవారు సర్ధిచెప్పడంతో బస్సు కు అడ్డుగా ఉన్న బైక్‌ను తొలగించాడు. కాగా చివరగా గొడవ సద్దు మనిగి బస్సు వెళ్తున్న క్రమంలో బస్సు వెనుక అద్దాలను రాయి విసిరి పగుల గొట్టాడు. దీంతో డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఎస్ ఐ నరేశ్‌రెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.