నేడు భార‌త్‌-ర‌‌ష్యాల మ‌ధ్య 21వ స‌ద‌స్సు

ఢిల్లీకి రానున్న ర‌ష్యా అధ్య‌క్షుడు

ఢిల్లీ(CLiC2NEWS): ‌భార‌త్, ర‌ష్యా దేశాల మ‌ధ్య సోమ‌వారం 21వ  స‌మావేశం  జ‌ర‌గ‌నుంది.  స‌మావేశానికి ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు డిల్లీకి రాను‌న్నారు. ప్ర‌తి ఏటా ఇరుదేశాల మ‌ధ్య జ‌రిగే స‌మావేశానికి ఇరుదేశాల అధ్య‌క్షులు స‌మావేశంలో పాల్గొంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 స‌మావేశాలు జ‌రిగాయి. సోమ‌వారం సాయంత్రం 5.30 గంట‌లకు భార‌త్ ప్ర‌ధాని మోడి, పుతిన్‌‌తో స‌మావేశ‌మౌతారు. ర‌క్ష‌ణ, వాణిజ్యం, సాంస్కృతిక‌, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.