ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్టీఆర్ న్యూ పోస్టర్
అభిమానులు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ట్రైలర్ ని చిత్రబృందం డిసెంబరు 3న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల డిసెంబరు 9వ తేదీకి వాయిదా వేసింది.
దీంతో అభిమానులు కొంత నిరూత్సాహానికి లోనయ్యారు. అభిమానులకోసం చిత్ర బృందం చిన్న సర్ప్రైజ్ ఇస్తూ.. ఎన్టీఆర్ పోస్టర్ను భీమ్ పాత్రకు సంబంధించినది తాజాగా విడుదల చేసింది. సాయంత్రం 4 గంటలకు రామ్చరణ్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.
ఎన్టీఆర్ న్యూ పోస్టర్లో రక్తంతో తడిచిన శరీరంతో రెండు చేతులతో తాడును పట్టుకొని ఆగ్రహంతో కనిపిస్తున్నాడు. ఆపోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. తారక్ అభిమానులు న్యూ పోస్టర్ అదిరిపోయిందంటూ కామేంట్లు చేస్తున్నారు.
BHEEM…. 💥💥💥
#RRRTrailerin3Days #RRRMovie #RRRTrailer pic.twitter.com/w3jA5xruVD
— RRR Movie (@RRRMovie) December 6, 2021