అనంత‌పురం జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం: న‌లుగురు మృతి

అనంత‌పురం(CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లాలో ఆటోను జీపు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ఉన్న న‌లుగురు వ్యక్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. వీరిని రాయ‌దుర్గం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. రాయ‌దుర్గం నుండి వెళ్తున్న ఆటోను జీపు ఢీకొన‌డంతో ఈ ప్రమాదం సంభ‌వించింది. మృతి చెందిన వారిలో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు ప్ర‌మాద స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.