భార‌త్,ర‌ష్యాల మ‌ధ్య సంబంధాలు బ‌లంగా ఉన్నాయి: విదేశాంగ మంత్రి

ఢిల్లీ (CLiC2NEWS) : భార‌త్ ర‌ష్యాల మ‌ధ్య జ‌రుగ నున్న ద్వైపాక్షిక వార్షిక స‌ద‌స్సులో పాల్గొనేందుకు ర‌ష్యా అధ్య‌క్ష‌డు వ్లాదిమ‌ర్ పుతిన్ మ‌రికాసేప‌ట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ స‌మావేశానికి ముందే రెండు దేశాల విదేశాంగ‌, ర‌క్ష‌ణ మంత్రులు ఢిల్లీలోని సుష్మాస్వ‌రాజ్ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. భార‌త విదేశాంగ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ర‌క్ష‌ణ మంత్రి జైశంక‌ర్‌, ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షోయిగు, విదేశాంగ మంత్రి సెర్గీ ల‌వ్‌రోవ్ మ‌ధ్య ద్వైపాక్షిక స‌మావేశం జ‌రిగింది.

ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు సుస్థిరంగా, బ‌లంగా ఉన్నాయ‌ని భార‌త విదేశాంగ మంత్రి ఎస్‌.జ‌య‌శంక‌ర్ తెలిపారు. ర‌క్ష‌ణ రంగంలో వివిధ అంశాల‌పై ఇరుదేశాల ర‌క్ష‌ణ మంత్రులు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈరోజు సాయంత్రం 5.30 గంట‌ల‌కు భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో భేటీ అవుతారు.

Leave A Reply

Your email address will not be published.