కొవిడ్ టీకా వేయించుకుంటేనే జీతాలు
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TSCAB) కీలక నిర్ణయం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TSCAB) వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తీసుకోని ఉద్యోగులకు జీతాలు ఇచ్చే ప్రసక్తే లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. కొవిడ్ కేసులుల పెరుగుతుండటం, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో.. తాజాగా టిఎస్ సిఎబి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగులు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం డిసెంబర్ 4వ తేదీనుండి అమలౌతుందని, ఈ నింధన టిఎస్ సిఎబి హెడ్ క్వార్టర్స్‌తో పాటు అన్ని బ్రాంచ్‌లకు వర్తిస్తుందని తెలియజేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ ఉంటేనే డిసెంబర్ నెల జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టంచేశారు వంద శాతం వ్యాక్సినేషన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు.