క‌రోనాతో మృతిచెందిన జ‌ర్న‌లిస్ట్‌ల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మృతిచెందిన జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు రూ. 2ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించ‌నుంది. డిసెంబ‌రు 15వ తేదీన చెక్క‌ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సిఎం కెసిఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అదేవిధంగా మార్చి నుండి డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు ఏడు నెల‌లో వివిధ కార‌ణాల‌తో మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం చేయ‌నున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో మ‌ర‌ణించిన కుటుంబాల నుండి 63 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.