అనులోమ.. విలోమ ప్రాణాయామం
చేయువిధానం.
- తెల్లవారుజామున బ్రహ్మ ముహుర్తాకాలంలో లేచి కాలకృత్యములు చేసుకొని వాకింగ్, లేదా రన్నింగ్, స్కిప్పింగ్, డాన్సింగ్ ఏదైనా వ్యాయామం 45 నిముషాలు చేయాలి.
- తరువాత ప్రశాంతమైన గాలి, వెలుతురు, వచ్చే ప్రదేశంలో పచ్చని గడ్డి లేదా ఒక తెల్లటి, లేదా బ్లూ కలర్ దుప్పటి వేసుకొని దాని మీద సుఖాసనం లేదా వజ్రాసనం, లేదా సిద్దాసనం లేదా పద్మాసనం లో కూర్చోవాలి.
- కూర్చున్నపుడు నడుము తిన్నగా నిటారుగా ఉండాలి. చూపు భూమికి సమాతరంగా చూస్తూ తలను స్ట్రైట్ గా పెట్టాలి. ఎడమ చేతిని, కుడిచేతిని జ్ఞాన ముద్ర వేసి రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంచాలి
- ఇప్పుడు కుడిచేతిని పైకి లేపి దాని అంగుష్టంచే కుడి స్వరం మరియు అనామిక, మధ్యమ వేళ్ళ ద్వారా ఎడమ స్వరం మూసి నిలిపి వేయవలను. అర చేతిని నాసిక ఎదుట నుంచక కొంత పైకి లేపి ఉంచవలెను
- ఇడా నాడి (నామ స్వరం )సోమ, చంద్ర శక్తి,లేక శాంతికి ప్రతీకగా నున్నది. కావున నాడి సోదం కొరకు అనులోమ విలోమ ప్రాణాయామమును ఎడమ నాసిక ద్వారా ప్రారంభిపబడును. అంగుష్ట మాధ్యమున కుడి నాసికను మూసి వేసి ఎడమ నాసిక నుండి శ్వాసను నిదానంగా లోపలకు నింపవలెను.

శ్వాస పూర్తిగా లోపలకు నిండిన పిదప అనామిక మాధ్యామమున ఎడమ స్వరమున మూసి వేసి కుడి నాసిక నుండి శ్వాసను పూర్తిగా బయటకు వదిలివేయుము. మెల్లమెల్లగా శ్వాసప్రశ్వాసలను నడకలను మందము ,మరల తీవ్రంగా చేయవలెను. తీవ్రగతిచే పూర్తి శక్తితో శ్వాసను లోపల నింపుట మరియు బయటకు పంపుటలో తమ శక్తి అని అనుసరించి శ్వాస ప్రశ్వాసలతో గూడా శ్వాసల గతిని మందమము, మరియు మధ్యమము, తీవ్రముగా నోనర్చవలెను. తీవ్రగతిలో పూరకం, రేచకం, నోనుర్చటం వలన ప్రాణము తేజ ధ్వని గలది గనకను శ్వాస పూర్తిగా బయటికి వెళ్లిపోయిన పిదప నామస్వరమును మూసి వేయుచునే కుడి నాసిక నుండి శ్వాసను పూర్తిగా లోపల నింపి ఉంచవలెను. మరియు లోపల నిండిపోయిన తరువాత కుడి నాసిక రంద్రమును మూసి వేసి ఎడమ నాసికా రంద్రము నుండి శ్వాసను బయటికి వదిలి వేయుము. ఇలా ఒక ప్రక్రియ పూర్తయినట్లు.
ఈ ప్రకారం ఈ విధిని నిరంతరం మోనర్చుట అనగా ఎడమ నాసిక నుండి శ్వాసను తీసుకొని కుడి నాసిక నుండి బయటకు పంపివేయుట. మరల కుడి నాసిక ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసిక నుండి బయటికి పంపి వేయుట. ఈ క్రమముగా దాదాపు ఒక నిమిషం వరకు చేయుట వలన కొంత అలసట కలిగినట్లు అనిపిస్తుంది. ఆలా అలసట వచ్చినపుడు కొద్దిగా విరామం ఇచ్చి మరల చేయవలెను. ఈ ప్రకారం మూడు నిమిషములచే ప్రారంభించి పది నిమిషములకు వరకు చేసుకోవచ్చును. ఎండాకాలంలో తక్కువ చేయాలి.

లాభాలు..
1.ఈ ప్రాణాయామము చేయటం వలన ఒక కోటి డెబ్బడి రెండు లక్షల, పదివేల రెండు వందల పది నాడులు పరిశుద్ధమగును. సంపూర్ణ నాడులు శుద్ధి ఆగుట వలన శరీరం పూర్తి ఆరోగ్యం, కాంతిమయము మరియు శక్తివంతమగును.
2. శారీరక, మానసిక ఒత్తిడి నుండి విముక్తి కలుగుతుంది.
3. హృదయ శిరలలో పేరుకోపోయిన బ్లాకేజ్ విప్పుకొనును. దీనిని 5:నెలలు చేసినట్లయితే గుండె నుండి శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.పేరుకోపోయిన కొలెస్ట్రాల్, తగ్గును.
4. మస్తీష్కమ్ చైతన్యవంతంగా మారుతుంది. మరియు బ్రెయిన్ లో వున్న చిన్న చిన్న ప్రాబ్లెమ్ క్లియర్ అవుతాయి. చక్కని వాయువు అంది రక్త ప్రసరణ మెదడుకు బాగా జరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
5. శరీరంలో పేరుకోపోయిన గ్యాస్ బయటికి వస్తుంది. కిళ్ళ వాతం, సంధి వాతం, ఆమ్ల వాతం, పార్కిన్సన్, తగ్గుతాయి.
6. దాతు రోగాలు, వాత రోగాలు, మూత్రరోగాలు, ఆమ్ల పిత్తం, జలుబు, పడిసం, దగ్గు, సైనస్, తగ్గుతాయి.
7. అస్తమా, నంజు, కఫ రోగాలు, పిత్త రోగాలు, టాన్సిల్స్, తగ్గుతాయి.
8. త్రిదోషాలు తొలిగించగలదు.
9. పిచ్చి ఆలోచనలు రావు. ఆధ్యాత్మికంగా వుంటారు.
10. రాలి పోయే జుట్టు ఆగుతుంది. Dandruf తగ్గుతుంది.
11. ముఖంలో, ఓజం, తేజం, పెరుగుతుంది. మొటిమలు తగ్గుతాయి.
-షేక్. బహార్ ఆలీ
యోగాచార్యుడు