డిసెంబర్ 18 నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియం ప్రాంగణంలో ఈనెల 18వ తేదీనుండి బుక్‌ఫెయిర్ నిర్వహించనున్నట్లు బుక్‌ఫెయిర్ కమిటి అధ్యక్షుడు జూలూరి గౌరి శంకర్ తెలియజేశారు. ఈ బుక్‌ఫెయిర్ పది రోజులపాటు కొనసాగుతుందని, దీనిలో దాదాపు 260కి పైగా స్టాల్స్ ఉంటాయని చెప్పారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యవరణంపై ప్రసంగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారని, చిన్నపిల్లలు, మహిళలను సైతం ఆకర్షించే పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.