హైకోర్టు సిజేకి మేడ్చల్ ఐటిఐ కళాశాల విద్యార్థుల లేఖ..
హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణలోని మేడ్చల్ ఐటిఐ కళాశాల తరలింపును అడ్డుకోవాలని కోరుతూ కళాశాల విద్యార్థులు హైకోర్టు జస్టిస్ సిజే సతీష్ చంద్రశర్మకు లేఖ రాశారు. కళాశాలను దూరంగా తరలిస్తే విద్యార్థుల ప్రయాణానికి ఇబ్బంది పడతారని, విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకుంటూ స్థానికంగా ఉన్న పరిశ్రమలలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారని, దీని వలన అనేక పేద విద్యార్థులు ఇబ్బంది పడతారని లేఖ ద్వారా ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశారు. ఈ లేఖను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సిజె ధర్యాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఈమేరకు పూర్తి వివరాలతో 8 వరాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు కళాశాల తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని స్టే విధించింది. కేసు విచారణను మార్చి 29వ తేదీకి వాయిదా వేసింది.