తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నిర్థారణ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు మరో నాలుగు నమోదయ్యాయి. కెన్యా నుండి వచ్చిన వారిలో ముగ్గురికి, ఎక్కడికి ప్రయాణం చేయని మరో వ్యక్తిలో ఈ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్థారణయ్యింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. మరో ముగ్గురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రాగా వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్‌కు పంపారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 87కు పెరిగాయి.
ఇప్పటి వరకు రిస్క్ దేశాలనుండి రాష్ట్రానికి 6,764మంది ప్రయాణికులు వచ్చారు.వీరిలో 21మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ కాగా.. వీరందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్‌కు పంపారు. వీరిలో ఏడుగురికి మాత్రం ఒమిక్రాన్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. మరో ముగ్గురి ఫలితాలు రావలసి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.