వాజ్‌పేయీ గొప్ప‌నేత : కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్: న‌గ‌రం‌లోని బిజెపి కార్యాల‌యంలో మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయీ జ‌యంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కిష‌న్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, రాజాసింగ్‌, విజ‌య‌శాంతి కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్‌పేయీ ప్ర‌పంచంలోనే గొప్ప నేత అని కొనియాడారు. వాజ్‌పేయీ జ‌న్మ‌దినాన్నిసుప‌రిపాల‌న దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నాం. న‌వ‌శ‌కానికి ఆయ‌న నాంది ప‌లికార‌ని, ఆయ‌న ఆశ‌యాల‌ను మోదీ అమ‌లుచేస్తున్నార‌న్నారు.

బండి సంజ‌య్ మాట్లాడుతూ.. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆయ‌న గురించి తెలియ‌జేయాల‌న్నారు. ప్ర‌ధానిగా ఆయ‌న సుప‌రిపాల‌న అందించారు. పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి 65 సంవ‌త్స‌రాలు ప‌నిచేశారు. ఆయ‌న క‌ల‌ల‌ను సాకారం చేసేందుకు కృషి చేయాలి అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.