AP: మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్‌న్యూస్..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడల్ స్కూల్ టీచర్లకు శుభవార్త తెలిపింది. మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 60 ఏళ్లుకు పెంచింది. ఈ మేరకు ఎపి పాఠశాల విద్యా శాఖ మంత్రి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఎపి మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ అధ్యక్షడు పి.మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కండేయులు, ప్కోగ్రెసివ్ టీచర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, కె. శిశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. చంద్ర శేఖర్ హర్షం వ్యక్తం చేశారు.