తెలంగాణలో కరోనా ఆంక్షలు జారీ..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. జనవరి 2వ తేది వరకు ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు. ఇతర కార్యక్రమాల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.