AP: వైద్య ఆరోగ్యశాఖ‌లో ఖాళీల భ‌ర్తీ..

శ్రీ‌కాకుళం (CLiC2NEWS): జిల్లాలోని వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ప‌లు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతోంది. ఈ మేరకు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఒటి టెక్నీషియ‌న్, డెంట‌ల్ హైజ‌నిస్ట్‌/ డెంట‌ల్ టెక్నీషియ‌న్ పోస్టుల‌కు ఆర్హులైన అభ్య‌ర్థుల‌నుండి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 8వ తేదీ నుండి 13 వ‌తేదీ లోగా జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యానికి స‌మ‌ర్పించాలి.

పోస్టుల వివ‌రాలు:
జిల్లా అకౌంట్స్ అధికారి – ఎమ్‌బిఎ ఫైనాన్స్‌)/ ప‌ఇజి ఇన్ కామ‌ర్స్ అభ్య‌ర్థులు అర్హులు. అకౌంటింగ్ సాప్ట్‌వేర్‌లో క‌నీసం రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

స్పెష‌లిస్ట్ ఎమ్‌డి (జ‌న‌ర‌ల్ మెడిస‌న్‌), స్పెష‌లిస్ట్ ఎమ్ ఓ(ఒబిజి), కార్డియాల‌జిస్ట్‌, సైకాల‌జిస్ట్‌, ఎన్‌సిడి వైద్యాధికారి, ఎన్ ఆర్ సి వైద్యాధికారి పోస్టుల‌ను ఇంట‌ర్వ్యూ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 12వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు డిఎమ్‌హెచ్ ఒ కార్యాల‌యాన‌కి హాజ‌రు కావాల‌ని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.