తమిళనాడులో ఒక రోజు పూర్తి లాక్డౌన్!
10వేలకు పైగా కరోనా కేసులు నమోదు
చెన్నై (CLiC2NEWS): తమిళనాడులో కరోనా వేగం ఎక్కవగా ఉంది. గత మూడురోజులుగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులోఉంది. కొవిడ్ పాజిటివ్ కేసులు 10వేలకు పైగా నమోదుకావడంతో లాక్డౌన్ అమలు చేయాలని సిఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆదివారం లాక్డౌన్ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలందరూ విధిగా నిబంధనలు పాటించాలని ఆరాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలియజేశారు. పాలు, అత్యవసర కార్యకలాపాలు, వైద్యసేవలు వంటి వాటికి అనుమతినిచ్చారు. అత్యవసర సేవలకుసంబంధించిన వాహనాలు, శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న అయ్యప్పభక్తుల వాహనాలకు మాత్రం అనుమతించారు. సబర్బన్ రైళ్లలో 50% ప్రయాణికులకు మాత్రమే అనుమతించారు.