విద్యార్థి పాటకు కెటిఆర్ ఫిదా.. భవిష్యత్తులో మంచి గాయకుడు కావాలని ట్వీట్
హైదరాబాద్(CLiC2NEWS) : ఓ విద్యార్థి పాడిన పాటను విన్న తెలంగాణ పురపాలక శాఖామంత్రి కెటిఆర్ మంత్రముగ్దుడయ్యాడు. ఆ విద్యార్థి భవిష్యత్తులో మంచి గాయకుడు కావాలని కోరుకుందాం… అంటూ కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట ప్రభుత్వ పాఠశాలలె విద్యనభ్యసించే విద్యార్థి సాయికుమార్ తెలంగాణ తొలితరం దళిత కవి రున్న ఇద్దాసు రాసిన గేయాన్ని ఆలపించాడు.
“జ్ఞానికేఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానులకు ఏమెరుక వారుండే స్థలము.. సద్గురుడుండే మరుగు“ అని సాగే గేయాన్ని సాయికుమార్ పాడాడు.
తెలంగాణ తొలితరం కవి దున్న ఇద్దాసు రాసిన తత్వాల ఆధారంగా వచ్చిన గేయం ఇది అని కెటిఆర్ ట్వీట్ చేశారు. సాయికుమార్ భవిష్యత్తులో మంచి గాయకుడు కావాలని కోరుకుందాం అని మంత్రి పేర్కొన్నారు.
A young child సాయి కుమార్
తాటికుంట పాఠశాల విద్యార్థి
మల్దకల్ మండలం
జోగులాంబ గద్వాల జిల్లాభవిష్యత్తు లో
మంచి గాయకుడు
కావాలనీ కోరుకుందాంతెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు గారు రాసిన తత్వాల ఆధారంగా వచ్చిన గేయం ఇది pic.twitter.com/qfyAmNsTah
— KTR (@KTRTRS) January 10, 2022