వృద్ధురాలి న్యాయపోరాటం విజయవంతం..
బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటకలో ఓవృద్ధురాలు తనను పిల్లలు ఇంట్లోనుంచి గెంటేశారని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కర్ణాటకలోని హవేరి జిల్లా హానగల్ తాలూకా వీరపుర గ్రామానికి చెందిన 76 ఏళ్ల వృద్దురాలు ప్రేమవ్వ తన ఆస్తిని ఇద్దరు కుమారులు, కుమార్తె రాయించుకున్నారు. ఆరు సంవత్సరాల క్రితం ఆమె భర్త మృతిచెందారు. ఆమె సంరక్షణ బాధ్యత తమది కాదని పిల్లలు మొఖం చాటేశారు. ఆ వృద్ధురాలు జిల్లా కేంద్రంలోని స్వధార్ గృహ్‌లో చేరారు. దీనిని నిర్వహించే పరిమళ్‌జైన్ వృద్ధురాలి విషయం తెలుసుకొని కోర్టునుఆశ్రయించారు. విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం.. వృద్ధురాలికి నెలకు రూ. 10 వేలు చెల్లించాలని కుమారులకు నోటీసులు జారీ చేసింది. అప్పటికి వారు స్పందించకపోవడంతో కుమారులిద్దరి పేరిట ఉన్న వ్యవసాయ భూమిని ప్రేమవ్వకు బదిలీ చేయాలని ఆదేశించింది.