క్రీడాకారిణి మ‌ల్లికా హందాకు కెటిఆర్ ఆర్థిక సాయం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ పుర‌పాల‌క శాఖామంత్రి కెటిఆర్ క్రీడాకారిణి మ‌ల్లికా హందాకు రూ.15 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించారు. ప్ర‌తిభ ఉండి ఆర్థికంగా వెనుబ‌డిన ఎంతో మందికి మంత్రి కెటిఆర్ ఆర్థిక స‌హాయం అందించేవారు.  సోమ‌వారం పంజాబ్ రాష్ట్రానికి చెందిన దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మ‌ల్లిక‌కు రూ 15 ల‌క్ష‌లు తో పాటు భ‌విష్య‌త్ పోటీల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు ల్యాప్‌టాప్‌ను కూడా అందించారు. మ‌ల్లికకు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాల‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు.

అంత‌ర్జాతీయ డెఫ్ ఛాంపియ‌న్ షిప్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన తొలి భార‌త క్రీడాకారిణి మ‌ల్లిక హందా. అంత‌ర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప‌లు ప‌త‌కాలు సాధించింది. 2012 వ సంవ‌త్స‌రంలో మ‌ల్లిక ఏడుసార్లు జాతీయ ఛాంపియ‌న్ షిప్‌ను గెలుచుకుంది.

Leave A Reply

Your email address will not be published.