ఎపిలో కొత్తగా 984 క‌రోనా కేసులు న‌మోదు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 984 కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే కొవిడ్ కార‌ణంగా ఎవ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 152 మంది క‌రోనా బారి నుండి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఎపిలో 5,606 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాత్రి క‌ర్ఫ్యూని అమ‌లు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. రాత్రి 11గంటల నుండి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.