మున్నేరు ఘటన విషాదాంతం..
కృష్ణా (CLiC2NEWS) : మున్నేరు ప్రాంతంలో కనిపించకుండా పోయిన చిన్నారులు విగత జీవులుగా మారారు. చందర్లపాడు మండలం ఏటూరి గ్రామం మున్నేరులో ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం నుండి గాలింపు చర్యలు కొనసాగించారు. ఈరోజు ఉదయం వారి మృత దేహాలు లభ్యమయ్యాయి. ఏటూరి గ్రామానికి చెందిన మూగులూరి సన్నీ(12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్ (12), మైలా రాకేష్ (11), గురజాల చరణ్ (14) గా గుర్తించారు. విగతజీవులుగా మారిన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.