అన్ని ఆస్పత్రులలో గర్భిణులకు వైద్యం అందించాలి: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్నిదవాఖానాలలో చికిత్సనందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఆయన మంగళవారం వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, అసుపత్రుల సన్నద్ధత వంటి పలు అంశాలపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌గా తేలిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక ఆపరేషన్ థియేటర్ వార్డును ప్రత్యేకంగా కేటాంయించాలని సూచించారు. అన్ని సౌకర్యాలు ఉండి, వారిని ఇతర ప్రభుత్వ పెద్దాసుపత్రులకు రిఫర్ చేయొద్దని మంత్రి పేర్కొన్నారు. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలుఅవసరమైన వారిని కొవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించొద్దని ఆదేశించారు.
కరోనా తగ్గుముఖం పట్టేవరకు బస్తీ దవాఖానాలు, పిహెచ్‌సిలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని దవాఖానాలకు అవసరమైన వైద్య పరికరాలు అందించడం జరిగిందని, అవిపూర్తి స్థాయిలో వినియోగంలో ఉండేలా చూడాలన్నారు.