తెలంగాణ‌లో కొత్తాగా 1920 క‌రోనా కేసులు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో కొత్తాగా 1,920 కొవిడ్‌ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 83,153 మందికి క‌రోనానిర్థార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హించారు. కొత్త‌గా 1,920 మందికి పాజిటివ్ గా నిర్థార‌ణయ్యింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌లో న‌మోద‌యిన మొత్తం కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. ఈ మేర‌కు వైద్యారోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఇక గ‌డిచిన 24 గంటల్లో ఇద్దరు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా బారి నుండి 417 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం15,969 యాక్టివ్ కేసులున్నాయి.

Leave A Reply

Your email address will not be published.