ఎపిలో మూడు రోజుల పాటు వ‌ర్ష సూచ‌న‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): నైరుతి బంగాళాఖాతం ప‌రిస‌రాల్లో ఏర్ప‌టిడిన ఉప‌రిత ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ ఆవ‌ర్త‌నం స‌ముద్ర‌మ‌ట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వ‌ర‌కు వ్యాపించి ఉంది. దీని ప్ర‌భావంతో ఉత్త‌ర కోస్తాంధ్ర‌లో ఇవాళ (బుధ‌వారం) ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌నిపేరొ్కంది. అలాగే రేపు, ఎల్లుండి ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశంఉంద‌ని పేర్కొంది.

ద‌క్షిణ కోస్తాలో ఇవాల్టి నుంచి మూడు రోజుల‌పాటు కొన్ని చోట్ల తేలిక పాటినుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. రేపు ఎల్లుండి మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశంఉంద‌ని పేర్కొంది.

రాయ‌ల‌సీమ‌లో ఇవాళ‌, రేపు, ఎల్లుండి ఒక‌టి లేదా రెండు చోట్ల మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.