మార్చి 31 లోపు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ‘ద‌ళిత‌బంధు’: మంత్రి హ‌రీశ్‌రావు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 లోపు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత‌బంధు అమ‌లు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదేశించిన‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఈసంద‌ర్భంగా మంత్రి సంగారెడ్డి జిల్లాలో ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో వంద మందికి నిధులు మంజూరు చేశామ‌ని, క‌లెక్ట‌ర్ ఖాతాలో నిధులు జ‌మ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.