ఎపిలో 14వేలకుపైగా కరోనా కేసులు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో46,650 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 14,440 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. ఒక్కరోజులో నలుగురు ఈ వైరస్‌తో మృతిచెందారు. ఇక గడిచిన 24 గంటల్లో ఈవైరస్ నుండి 3,969 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో83,610 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు వైద్యారోగ్య శాఖ బుటిటెన్ విడుదలచేసింది. అత్యధికంగా విశాఖజిల్లాలో 2,258, అనంతపురంలో 1,534 , గుంటూరు 1,458, ప్రకాశం 1,399 కేసులు నమోదయ్యాయి.