త్వరలో అదిలాబాద్‌కు ఐటీ టవర్ మంజూరు : మంత్రి కెటిఆర్ హామీ
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రగతిభవన్‌లో మంత్రి కెటిఆర్‌ను మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలోని బృందం కలిసింది. ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిపిఐ) పునరుద్ధరణ, జిల్లా సమస్యలు గురించి కెటిఆర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సిపిఐ అంశంపై అవసరమైతే దిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. సిపిఐ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిద్దామని సూచించారు. త్వరలో ఆదిలాబాద్‌కు ఐటీ టవర్ మంజూరు చేస్తామని.. టెక్స్టైల్ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.