నార్కోటిక్ డ్ర‌గ్స్ వాడ‌కాన్ని మొగ్గ‌లోనే తుంచేయాలి: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మాద‌క‌ద్ర‌వ్యాల వాడ‌కం ఇంకా ప్ర‌మాద‌స్థాయికి చేరుకోలేద‌ని, మాద‌క‌ద్ర‌వ్యాల వాడ‌కాన్ని మొగ్గ‌లోనే తుంచేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు. డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌పై శుక్ర‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సిఎం కెసిఆర్ కీల‌క స‌మీక్ష నిర్వ‌హించారు. హోం, అబ్కారీ శాఖామంత్రులు మ‌హ‌మూద్ అలీ, శ్రీ‌నివాస్ గౌడ్‌, సిఎస్ సోమేశ్ కుమార్ ,డిజిపి మహేంద‌ర్ రెడ్డి ప‌లు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో డ్ర‌గ్స్ వినియోగం ప్రాథ‌మిక స్థాయిలోనే ఉంద‌ని, పెరిగితే అభ‌వృద్దిని నాశ‌నం చేస్తుంద‌ని సిఎం అన్నారు. డ్ర‌గ్స్ నిర్మూల‌న‌లో స‌మాజం స‌హ‌కారం తీసుకోవాల‌ని  సూచించారు. గ్రామాల‌లో ఏ రైతు అయినా గంజాయి సాగు చేస్తే తెల‌పాల‌న్నారు. స‌మాచారం ఇవ్వ‌క పోతే గ్రామానికి రైతుబంధు ర‌ద్దు చేయాల‌న్నారు. డ్ర‌గ్స్ నెట్‌వ‌ర్క్ లింక్ గుర్తించి నిర్మూలించాలి. డ్ర‌గ్ మాఫియా క‌ట్ట‌డికి పోలీసులు అధునాత‌న ప‌రిక‌రాలు వాడాలి, స్కాట్లండ్ పోలీసుల విధానాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. అవ‌స‌ర‌మైతే డ్ర‌గ్స్ నిర్మూలిస్తున్న దేశాల్లో ప‌ర్య‌టించాల‌ని సిఎం సూచించారు. పంజాబ్ రాష్ట్రంలో డ్ర‌గ్ కంట్రోల్ చేస్తున్న అధికారుల‌ను పిలిపించి వారితో శిక్ష‌ణ తీసుకోవాల‌న్నారు.

డ్ర‌గ్స్ కంట్రోల్ విష‌యంలో తెలంగాణ పోలీస్‌, ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని కెసిఆర్ తెలిపారు. ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం కోసం సృజ‌నాత్మ‌క కార్య‌క్ర‌మాలు తేవాల‌ని ఆధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. అద్భుత ప‌నితీరు క‌న‌బ‌రిచిన వారికి ప్రోత్సాహాకాలివ్వాల‌న్నారు. డ్ర‌గ్స్ క‌ట్ట‌డిలో ఎంత‌టివారినైనా ఉపేక్షించేదిలేద‌ని.. ఏపార్టీకి చెందిన వారైనా వ‌రిలే ప్ర‌స‌క్తే లేదు అని సిఎం స్ప‌ష్టం చేశారు. నేర‌స్థుల విష‌యంలో సిఫార‌సులు తిర‌స్క‌రించాల‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.