India Corona: పెరుగుతున్న మ‌ర‌ణాలు.. త‌గ్గుతున్న కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి క్ర‌మంగా అదుపులోకి వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త క‌న్ని రోజులుగా రోజు వారీ కొత్త కేసులు మూడు ల‌క్ష‌ల‌కు దిగువ‌నే న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం ఆరు వంద‌ల మందికిపైగా మ‌ర‌ణించ‌గా.. నేడు ఆ సంఖ్య 870కి చేరింది.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 17 ల‌క్ష‌ల మందికి వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా 2,35,532 మందికి క‌రోనా పాజిటివ్గా తేలింది. తాజా కేసుల‌తో క‌లిలి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,08,58,241కి చేరింది.

కాగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 871 మందికి క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొతంతం 4,93,198 మంది మ‌ర‌ణించారు.

గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 3,35,939 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,83,60,710 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

దేశంలోని కేర‌ళ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఆ రాష్ట్రంలో 54,537 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. కేర‌ళ‌లో తాజాగా 352 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.