ఘట్‌కేసర్‌లో ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
ఘట్‌కేసర్ (CLiC2NEWS): ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో4,5వ వార్డులలో 5లక్షలతో మంచినీటి పైప్ లైన్, 10లక్షలతో ఓపెన్ జిమ్ ను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మున్సిపల్ కమిషనర్ వసంత , వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి , టిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. 10 లక్షల నిధులతో ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓపన్ జిమ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా వ్యయమాం చేయడం ఆరోగ్య పరంగా కూడా దృడంగా ఉంటూ అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. అదేవిధంగా 5 లక్ష్యల నిధులతో ఘట్కేసర్ మున్సిపాలిటీ 4వ మరియు 5వ వార్డుప్రజలకు మిషన్ భగీరథ నీటి సరఫరా ని ప్రారంభించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి,కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ ,బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ రాఘవ రెడ్డి, కడపొల్లా మల్లేష్, బేతాల నర్సింగ్ రావ్, మున్సిపల్ అధికారులు AE శ్రీనివాస్, మేనేజర్ అంజి రెడ్డి, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వారు, ఘట్కేసర్ మున్సిపల్ TRS పార్టీ ప్రధానన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంపాల సుధాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, పడిగం వెంకటేశ్వర రావు, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి , మాజీ బ్యాంకు డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ TRS సెక్రటరీ లు మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొంత సుధాకర్, బీసీ సెల్ అధ్యక్షుడు బర్ల హరి శంకర్ ముదిరాజ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు కుతుబద్దీన్ గారు, ఘట్కేసర్ ఘట్టు మైసమ్మ గుట్ట డైరెక్టర్ బొక్క జంగారెడ్డి, కీసర గుట్ట డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, TRS పార్టీ నాయకులు సల్లూరి నర్సింగ్ రావ్,పల్లె విజయ్ గౌడ్, బొక్క విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డు ప్రెసిడెంట్స్ k. హరికిషన్ రెడ్డి, మల్లి కార్జున్ రాజు,మేడబోయిన సంజీవ ముదిరాజ్, పోట్ల చెరువు శరత్ తదితరులు పాల్గొన్నారు.
