అధికారిక లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు..
ముంబయి (CLiC2NEWS): ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుఉల కన్నీటి వీడ్కోలు నడుమ అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. లతామంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి హజరై నివాళులర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్, సచిన్ టెండూల్కర్, షారూక్ ఖాన్, జావేద్ అక్తర్ తదితరులు హజరై నివాళులర్పించారు.
