దేశంలో లక్ష‌కు దిగొచ్చిన‌ క‌రోనా కేసులు

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కారోనా ఉదృతి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1,07,474 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా మ‌హ‌మ్మారితో 865 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మ‌ర‌ణాల సంఖ్య 54,01,979కు చేరింది. ఇక గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 2,13,246 మంది ఈ వైర‌స్ బారి నుండి కోలుకున్నారు. రిక‌వ‌రీ రేటు 95.91% గా న‌మోద‌యింది. శనివారం ఒక్క‌రోజు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు దాదాపు 43 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.