సమతామూర్తిని దర్శించుకున్న కేంద్రమంత్రి అమిత్షా
హైదరాబాద్ (CLiC2NEWS): సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈరోజు సమతామూర్తి కేంద్రానికి వచ్చారు. మంత్రితో పాటు బండి సంజయ్ కూడా ఉన్నారు. కేంద్రం యొక్క విశిష్టత గురించి త్రిదండి చినజీయర్ స్వామి మంత్రికి వివరించారు. అదేవిధంగా శ్రీరామనగరంలోని 108 దివ్య దేశాలను అమిత్ షా, బండి సంజయ్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా హోమంత్రి మాట్లాడుతూ .. చినజీయర్ స్వామితో 2003లోనే పరిచయం ఏర్పడినదని, గుజరాత్ భూకంప బాధితులకు ఆయన సాయం చేశారన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ సమతామూర్తిని దర్శించుకోవాలని అన్నారు. రామానుజాచార్యుల వారు వెయ్యళ్ల క్రితే సమతా సూత్రం బోధించారు. ఆయన బోధనలు దేశం నలుమూలల వ్యాపించాయి.దేశంలో ప్రసిధ్ధ క్షేత్రంగా సమతా కేంద్ర ఖ్యాతి గడిస్తుందన్నారు. రామానుజాచార్యుల వారు 120 సంవత్సరాలు జీవించారు. మనిషి 60 ఏళ్లు జీవించడమే ఎక్కువగా ఉన్న రోజులలో 120 ఏళ్ళు ఆయన జీవించారన్నారు. ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయన్నారు. వేదాల్లో చెప్పినవిధంగా ఆయన జీవించి చూపారున్నారు.