ఎస్.పి.బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్
ఎస్.పి.బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్
ఎస్.పి.బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్

గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా.. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం హాస్పటల్ వర్గాలు అధికారికంగా బులెటిన్‌ను విడుదల చేశాయి. ప్రముఖ గాయకుడు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆయన చెన్నైలోని ఎమ్.జి.ఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఆస్పత్రి ఎస్పి బాలు ఆరోగ్యంపై బులెటిన్ ను విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని బులెటిన్ లో తెలిపారు. బాలు ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించిందని ఆస్పత్రి తెలిపింది. బాలు ఆరోగ్యం దష్ట్యా ఆయనను ఐసియు లో చేర్చినట్లు , వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి తెలిపింది. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో గురువారం రాత్రి ఐసీయూకి తరలించినట్లుగా హాస్పటల్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని, లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లుగా తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో హాస్పటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లుగా ఎంజీఎం హాస్పటల్ వర్గాలు వెల్లడించాయి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో.. త్వరగా ఆయన కోలుకోవాలని పలువురు ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని కోరారు. ‘కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ఆయన త్వరగా కోలుకుని కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుని మనసారా ప్రార్థించుదాం’ అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.