మహబూబ్‌నగర్ ఉడా ఏర్పాటు చేస్తూ.. ఉత్తర్వులు జారీ..
హైదరాబాద్ (CLiC2NEWS): మహబూబ్‌నగర్ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. x మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలతో కలిపి అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మూడు మున్సిపాలిటీల పరిసర గ్రామాలతో కలిపి అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీనివాసగౌడ్ అన్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూరు కలిసి అనూహ్యంగా అభివృద్ది సాధిస్తుందని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందని మంత్రి తెలిపారు,.