సిఎం కెసిఆర్‌కు మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం..
మామద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది: ఉద్ధవ్ ఠాక్రే
హైదరాబాద్ (CLiC2NEWS): మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ కానున్నారు. బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్దవ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం కెసిఆర్‌కు ఫోన్ చేసి ముంబయి రావాలని.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు.
కెసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈదేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మామద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మావంతు సహకారాన్ని అందిస్తాం అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
తెలంగాణ సిఎం కెసిఆర్ ఈనెల 20వ తేదీన ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు.
మహారాష్ట్ర సిఎం ఆహ్వనం మేరకు ఫిబ్రవరి 20వ తేదీన కెసిఆర్ ముంబయి వెళ్లనున్నారు.