ఐటీ మంత్రి కెటిఆర్‌కు అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కెటిఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్ సదస్సులో పాల్గొనాల్సిందిగా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. రాష్ట్రంలో అభివృద్ధికి తీసుకున్న చర్యలు, టర్బో ఛార్జింగ్ ఇండియా అనే అంశాలపై మాట్లాడాలంటూ హార్వర్డ్ యూనివర్సిటీ మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించింది. ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న సదస్సులో మంత్రి వర్చువల్‌గా పాల్గొననున్నారు.
Look forward 👍 https://t.co/Pgb4E8wjgF
— KTR (@KTRTRS) February 18, 2022