మహారాష్ట్ర సిఎంతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ
ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదివారం సమావేశమయ్యారు. ఇవాళ సిఎం కెసిఆర్ తన బృందంతో కలిసి మధ్యాహ్నం ముంబయి చేరుకున్నారు. కెసిఆర్ బృందానికి సిఎం ఉద్ధవ్ ఠాక్రే విందు ఏర్పాటు చేశారు. లంచ్ అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు.
కేంద్ర సర్కార్ పై వ్యతిరేక కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు సిఎంలు సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సిఎం కెసిఆర్ బృందం కలవనుంది. సాయంత్రం 7.30 గంటలకు సిఎం కెసిఆర్ ముంబయినుంచి హైదరాబాద్‌కు రానున్నారు.
ఈ సమావేశంలో కెసిఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్, రంజిత్‌రెడ్డి, బిబి పాటిల్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.