న‌గ‌రంలో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైదరాబాద్ (CLiC2NEWS):  మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ -3కి సంబంధించిన 2375 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ హెడర్ పైప్‌కు వాటర్ లీకేజీలు నివారించేందుకు గానూ మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది. అలాగే, కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ పంప్ హౌజ్ వ‌ద్ద‌ పలు మరమ్మత్తులు జరపనుంది.

కావున, తేదీ: 23.02.2022, బుధవారం ఉదయం 5 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 24.02.2022, గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 36 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 1 – శాస్త్రీపురం.

2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బండ్లగూడ.

3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 3 – భోజగుట్ట, చింతల్‌బ‌స్తీ, షేక్‌పేట్.

4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – అల్లబండ.

5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6 – జూబ్లీహిల్స్, ఫిల్మ్ న‌గర్, ప్రశాసన్‌నగ‌ర్‌, తట్టిఖానా.

6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – లాలాపేట(కొంత భాగం).

7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – సాహేబ్‌న‌గ‌ర్‌, ఆటోనగర్, సరూర్‌న‌గర్, వాసవి రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.

8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – సైనిక్‌పురి, మౌలాలి.

9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – స్నేహపురి, కైలాస్‌గిరి, దేవేంద్రనగర్.

10. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15 – గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్.

11. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 16 – మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, 9 నెంబర్.

12. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 18 – కిస్మత్‌పూర్, గంధంగూడ.

13. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్, మల్లిఖార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచర్ల, భరత్‌న‌గర్, పీర్జాదిగూడ.

14. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – ధర్మసాయి.

కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.