చిట్టీల పేరుతో రూ. 6 కోట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరారీ..
దర్శి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసానికి పాల్పడ్డాడు. చిట్టీల పేరుతో బాధితుల దగ్గర నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు. వసూలైన మొత్తం సొమ్ముతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్శి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ.6 కోట్ల వరకు బాధితుల వద్ద నుండి వసూలు చేసినట్లు పోలీసులకు తెలిపారు.