భారతీయులతో రొమానియా నుండి బయల్దేరిన తొలి విమానం..
ఉక్రెయన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్లో భారతీయులను రొమానియా, హంగేరి సరిహద్దులకు చేరుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే రొమానియా సరిమద్దులకు చేరుకున్న 219 మందితో తొలి విమానం ముంబయికి బయల్దేరినట్లు వెల్లడించారు. భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రొమానియా విదేశాంగశాఖ మంత్రి బోగ్దాన్ అరెస్కూకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.