శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 20 మంది విద్యార్థులు..
ఉక్రెయిన్ నుండి ముంబయికి చేరుకున్న భారతీయులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది విద్యార్థులు ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ భారత ఎంబసీ సాయంతో క్షేమంగా చేరుకోగలిగామన్నారు. తాము క్షేమంగా వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ నుండి భారతీయులతో తొలి విమానం ముంబయికి చేరుకున్న విషయం తెలిసినదే. మరో విమానం అర్ధరాత్రి 2 గంటలకు ఢిల్లీకి చేరుకుందని సోమేశ్ కుమార్ తెలిపారు. వీరిలో 28మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. 17 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు, 11 మంది ఎపి చెందిన వారున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్కు ఫ్రీగా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు.